ఇనుప కూలర్ vs ప్లాస్టిక్ కూలర్.. దేనితో చల్లని గాలి ఎక్కువగా వస్తుంది..? కొనేముందు తప్పక తెలుసుకోండి..

ఇనుప కూలర్ vs ప్లాస్టిక్ కూలర్.. దేనితో చల్లని గాలి ఎక్కువగా వస్తుంది..? కొనేముందు తప్పక తెలుసుకోండి..


ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి సామాన్యుడికి ఉన్న ఏకైక ఆసరా ఎయిర్ కూలర్. అయితే మార్కెట్లోకి వెళ్లినప్పుడు వినియోగదారులను వేధించే ప్రధాన ప్రశ్న.. ఇనుప కూలర్ కొనాలా? లేక ప్లాస్టిక్ కూలర్ కొనాలా? అని. ఏది ఎక్కువ కాలం వస్తుంది? ఏది కరెంటు బిల్లును తగ్గిస్తుంది? ఏది ఏసీ రేంజ్ చల్లదనాన్ని ఇస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇనుప కూలర్:

దశాబ్దాలుగా మన ఇళ్లలో రాజ్యమేలుతున్నవి ఇనుప కూలర్లే. మెటల్ కూలర్లు సాధారణంగా పెద్ద ఇనుప రెక్కల ఫ్యాన్లను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువ గాలిని అందిస్తాయి. వీటి బాడీ చాలా దృఢంగా ఉంటుంది. ఎండకు లేదా వర్షానికి త్వరగా పాడవవు. హాల్ లేదా పెద్ద గదుల కోసం ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి బరువుగా ఉంటాయి, రవాణా చేయడం కష్టం. సరిగ్గా పెయింటింగ్ వేయించకపోతే తుప్పు పట్టే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కరెంటు షాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

ప్లాస్టిక్ కూలర్:

నేటి ఆధునిక ఇళ్లలో ప్లాస్టిక్ కూలర్ల హవా నడుస్తోంది. వీటిని ఒక గది నుండి మరో గదికి సులభంగా మార్చుకోవచ్చు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండి, ఇంటి ఇంటీరియర్‌కు నప్పుతాయి. నీటితో నిరంతరం తడిసినా వీటికి తుప్పు పట్టే సమస్య ఉండదు. షాక్ కొట్టే ప్రమాదం కూడా చాలా తక్కువ. ఇనుప కూలర్లంత దృఢంగా ఉండవు. ఎండలో ఎక్కువ కాలం ఉంచితే ప్లాస్టిక్ పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

అసలు కూలింగ్ దేనిపై ఆధారపడి ఉంటుంది?

చాలామంది కూలర్ బాడీని బట్టి చల్లదనం వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. కూలింగ్ అనేది ప్రధానంగా ఈ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మోటార్ పవర్: మోటార్ ఎంత శక్తివంతంగా ఉంటే గాలి అంత దూరం వస్తుంది.

కూలింగ్ ప్యాడ్స్: పాతకాలం గడ్డి కంటే, ఆధునిక హనీకోంబ్ ప్యాడ్లు ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి.

వాటర్ పంప్: నీటి సరఫరా ప్యాడ్లన్నింటికీ సమానంగా జరిగినప్పుడే గాలి చల్లగా ఉంటుంది.

విద్యుత్ వినియోగం – నిర్వహణ

కరెంటు బిల్లు: ప్లాస్టిక్ కూలర్లు సాధారణంగా తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. ఇనుప కూలర్లలో పెద్ద మోటార్లు ఉండటం వల్ల కరెంటు బిల్లు కొంచెం ఎక్కువగా రావచ్చు.

మెయింటెనెన్స్: ఇనుప కూలర్లకు ప్రతి ఏటా పెయింటింగ్ వేయించాలి. ప్లాస్టిక్ కూలర్లకు కేవలం ప్యాడ్ల క్లీనింగ్ సరిపోతుంది.

నిర్ణయం మీదే: ఏది ఎంచుకోవాలి..?

  • మీది పెద్ద ఇల్లు లేదా షాపు అయితే బడ్జెట్ తక్కువలో ఎక్కువ గాలి కావాలంటే ఇనుప కూలర్ ది బెస్ట్.
  • గది చిన్నదై ఉండి, తక్కువ శబ్దంతో, చూడటానికి అందంగా, సులభంగా మూవ్ చేయగలిగేది కావాలంటే ప్లాస్టిక్ కూలర్ ఎంచుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *