బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం.. వీడియో చూస్తే వణకాల్సిందే..

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం.. వీడియో చూస్తే వణకాల్సిందే..


కేరళలోని త్రిస్సూర్‌లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. పేలుడులో ఆరుగురు చనిపోగా.. 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కన్పిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాణాసంచా నిల్వ ఉంచిన గోదాములో పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా.. భీకరంగా పేలుడు సంభవించింది.. ఏకధాటిగా.. కొన్ని నిమిషాల పాటు బాణాసంచా పేలాయి.. దీంతో ఈ ప్రాంతం భీకరంగా మారిపోయింది.. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది..

పేలుడు సంభవించినప్పుడు దూరం నుంచి తీసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.. భీకర పేలుడుతో స్థానికులు వణికిపోయారు.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది..అయితే.. వరుస పేలుళ్లు సహాయచర్యలకు విఘాతం కల్గిస్తున్నాయి.. ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని నివాస గృహాల్లో ధ్వంసమైన కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

త్రిశూర్‌లోని ముండతికోడ్ బాణసంచా నిల్వ కేంద్రంలో జరిగిన పేలుడులో గాయపడిన వారికి నిపుణులైన వైద్య సేవలు అందేలా చూడాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. వారి చికిత్స నిమిత్తం త్రిశూర్ వైద్య కళాశాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆమె సూచించారు. అంతేకాకుండా, సంఘటనా స్థలానికి తగినన్ని అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *