వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్‌ జీ

వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్‌ జీ


యువత ఎక్కువ లేదా వృథా ఖర్చు చేస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారుతోంది. ఒకప్పటిలా ప్రస్తుతం జెన్‌-Z, మిలీనియల్స్ రొటీన్‌గా ఆలోచించడం లేదని నిపుణులు అంటున్నారు. విజ్ఞత, ఆధునికతతో మేళవించిన ఆలోచనలను అమలు చేయడంలో ముందుంటున్నారు. మార్కెటింగ్ అధ్యయనాలు సైతం అదే చెబుతున్నాయి. యూత్‌ ‘మెటీరియల్ థింగ్స్’ కంటే ‘మెమరీస్’పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోందని స్పష్టం చేస్తున్నాయి. జెన్‌-Z ఇప్పుడు భౌతిక వస్తువుల కొనుగోలు కంటే.. గుర్తుండిపోయే జ్ఞాపకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పరిశోధనల్లో తేలింది. దాదాపు 68% మంది యువత తమ డబ్బును ఖరీదైన డిజైనర్ బ్యాగులు, ఆభరణాలు, గాడ్జెట్లు వంటివి కొనడం కంటే, తమకు ఆనందాన్నిచ్చే, జ్ఞాపకాలుగా మిగిలే సాధారణ అనుభవాలనే ఇష్టపడుతున్నారు. ఏదైనా కొంటే అది హుందాగా, జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా, మరచిపోలేని జ్ఞాపకంగా గుర్తుండిపోవాలనే ఆలోచన జెన్‌జీలోనూ, మిలీనియల్స్‌లోనూ పెరుగుతోంది. అలాంటి వాటిపైనే డబ్బును, సమయాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడుతోంది. ఖరీదైన వస్తువు కొంటే కొంతకాలానికే దానిపై ఆసక్తి తగ్గుతుంది. బదులుగా అదే ఖర్చును ట్రావెల్, ఫెస్టివల్స్, కాన్స్‌ర్టులు, డైనింగ్ అవుట్ వంటి అనుభవాలపై చేస్తే.. అదొక జ్ఞాపకంగా ఉండిపోతుందనే ఆలోచలకు యువత ప్రయారిటీ ఇస్తోంది. ఎందుకిలా అంటే.. అనుభవాలు కేవలం ఖర్చుతో ముగిసిపోవు. అవి కథలుగా, జ్ఞాపకాలుగా, సామాజిక సంబంధాలుగా ఉండిపోతాయి. కొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తాయని యువతరం భావిస్తోంది. ఫ్రెండ్స్‌తో గడపడం, ఆన్‌లైన్‌లో ఫొటోలు/వీడియోలు పోస్ట్ చేసుకోవడం, ఆ క్షణాలను గుర్తు చేసుకోవడం వంటివి భౌతిక వస్తువులు ఇవ్వలేని ఆనందాన్ని ఇస్తాయని ఈతరం నమ్ముతోంది. లగ్జరీ ఐటమ్స్ కొంతకాలం తర్వాత సాధారణమై పోతాయి. కానీ ఒక ఫెస్టివల్, ఒక ట్రిప్, ఒక మ్యూజిక్ ఈవెంట్ వంటివి జీవితాంతం గుర్తుంటాయి. అందుకే అలాంటి అనుభవాలపై ఖర్చు పెట్టడానికే ఇష్టపడుతోంది యువత.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త

త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు

పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *