ఎక్కువ సంపాదన కోసం చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. భారత్ తో పోలిస్తే.. ఇతర దేశాల్లో ఉద్యోగాలు మెరుగైన జీతాలు అందుకోవచ్నీ చాలా మంది నమ్ముతారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న ఓ వ్యక్తి తాను ఒక రోజులో ఎంత సంపాదిస్తాడో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత్, ఆస్ట్రేలియాలో జీతాలను పోలుస్తూ పెట్టిన వీడియోపై చర్చ మొదలైంది. ఆస్ట్రేలియాలో డ్రైవర్ గా పనిచేస్తున్న రవీందర్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో పెట్టాడు. “ఆస్ట్రేలియా అంటే ఏదో గొప్ప విషయం కాదు, ఇక్కడికి రావద్దు. భారత్ లో ఇంట్లో కూర్చొని హాయిగా భోజనం చేయండి” అని ముందు వ్యంగ్యంగా మాట్లాడాడు. ఉదయం 7:00 గంటలకు పని మొదలుపెట్టాననీ పని పూర్తయ్యే సరికి రాత్రి 12:00 అయిందనీ అయినా, ఒంట్లో ఏ మాత్రం అలసట లేదు అనీ అన్నాడు. రవీందర్ తన ఆదాయం గురించి మాట్లాడుతూ.. మరి తను ఎంత సంపాదించానంటే రోజుకు 650 నుంచి 700 ఆస్ట్రేలియా డాలర్లు. అంటే భారతీయ రూపాయలలో రూ.35 నుంచి రూ. 40 వేలు. భారత్ లోనైతే ఇది తన నెల మొత్తం జీతం అయ్యుండేది అన్నాడు. భారతదేశంలో ఒక నెల మొత్తం పనిచేస్తే వచ్చే ఆదాయం ఆస్ట్రేలియాలో కేవలం ఒక్క రోజులోనే సంపాదిస్తున్నటల రవీందర్ చెప్పుకొచ్చాడు. రవీందర్ తన జీవనశైలి గురించి మాట్లాడుతూ.. ఆ ఒక్క రోజు జీతంతో, తాను తన ఇంటికి నెల మొత్తానికి సరిపడా సరుకులు కొనగలిగానని తెలిపాడు. భారత్ బయట ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఇతరులకు సూచించాడు. తను చెప్పేదల్లా ఒక్కటే అనీ ఇళ్ల నుంచి బయటకు రండి, ఏదైనా ఇతర దేశానికి వెళ్లి, కష్టపడి పనిచేయండి, మనం పుట్టినప్పటి నుంచి ఉన్న పేదరికాన్ని వదిలించుకోండి అని సూచన చేసాడు. తను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాననీ కానీ తను ఇప్పటికీ వాళ్లంత కష్టపడలేకపోతున్నానని వాపోయాడు. రవీందర్ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన్ను సమర్థిస్తూ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు విదేశాల్లోని సవాళ్లను ప్రస్తావిస్తున్నారు. ‘విదేశాల్లో ఆదాయం ఎక్కువే కన్పిస్తుంది. కానీ, ఖర్చులు, పన్నులు కూడా అధికంగానే ఉంటాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ప్రతిఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. అందరూ ఆ జీవనశైలిని అలవాటు చేసుకోలేరు’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త
త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు
పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’
రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?