ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే


ఏ ఆలయం లో అయినా బ్రాహ్మణులు అర్చకులుగా ఉంటారు. వేదమంత్రాలు చదువుతూ దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆశీర్వచనం చేస్తూ గౌరవ మర్యాదలు అందుకుంటారు. గ్రామ దేవతలు కొలువైన ఆలయాలలో స్థానిక సంప్రదాయాల ప్రకారం బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉండటం చూస్తాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం లో ఎస్ సి సామాజిక వర్గాల వారే అర్చకత్వం లో ఉండి స్వామికి నిత్య కైంకర్యాల నుంచి పూజదికాలవరకు అన్నీ చేయడం విశేషం. ఉండి నియోజకవర్గంలో కొనసాగుతున్న రామాలయం వివాదం, మరో వైపు యస్ సి లు హిందూ ఆలయాల్లో అర్చకులు కాలేకపోతున్నారంటూ MRPS వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారడం చూశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు లో పూర్వం నుంచి ఎస్.సి. సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల గోత్రనామాలు, వేదాశీర్వాదాలు మాత్రమే కాదు తిరుప్పావై పారాయణం సైతం చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇది ఏదో చిన్న గుడి అనుకుంటే పొరపాటే 43 ఎకరాల భూములు ఆలయానికి ఉండగా అందులో అర్చకులుగా పని చేస్తున్న కుటుంబాలకు 12 ఎకరాలు కేటాయించారు. ఏటా రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఉండి మండలం ఉప్పులూరులోని శ్రీ చిన్న కేశవ స్వామి ఆలయానికి భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. అర్చకులు ఎస్.సి.లు అనే భావన భక్తులలో ఎక్కడా కనిపించదు. 12 తరాలకు పైగా వారసత్వంగా ఈ ఎస్.సి. పూజారులు కొనసాగుతూ వస్తున్నారు. గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి పలు సార్లు వీరిని మార్చి బ్రాహ్మణుల ను అర్చకులుగా చేసే ప్రయత్నం చేసినా పలు అనర్ధాలు జరగడంతో తరతరాలుగా ఎస్.సి. సామాజిక వర్గానికి చెందిన కుటుంబీకులే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అర్చకులను కుల ప్రాతిపదికన చూడరు. వారికి నమస్కారం చేసుకుని, ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రతి శుభకార్యక్రమానికి వీరిని పిలిచి గౌరవంగా చూసుకుంటారు. స్వామి వారికి ప్రాతః కాలపు సేవలు బాలభోగం, నైవేద్యం , మహా నైవేద్యం సైతం ఈ వైష్ణవదాసుల స్త్రీలు నిత్యం మడికట్టుకుని చేస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

Prakash Raj Vs Vijay: TVK చీఫ్ గాలి తీసిన ప్రకాశ్ రాజ్

Naga Babu: రామ నామాన్ని ఎగతాళి చేస్తే నాశనమైపోతావ్

‘ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..’ ఆహాలో మంచి సిరీస్

ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *