మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!

మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!


మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!

తమిళ స్టార్ దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తాము ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సంతోషకరమైన వార్తను అట్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చాడు మా ప్రపంచం మరింత వెలుగుతో నిండిపోయింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నెట్టింట ఈ పోస్ట్ చూసిన అట్లీ అభిమానులు, శ్రేయోభిలాషులు, సినితారారలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు లైక్స్ కామెంట్స్ చేసి వైరల్ చేస్తున్నారు.

కాగా అట్లీ, ప్రియ పదేళ్లకు పైగా ప్రేమించుకుని 2014లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే మీర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 2023లో ఈ దంపతులు మీర్‌కు జన్మనిచ్చారు. దాదాపు మూడెళ్ల తర్వాత తాజాగా ఏప్రిల్ 20న మరో ఆడబిడ్డకు అట్లీ దంపతులు జన్మనిచ్చారు. అయితే తాజాగా చేసిన పోస్ట్‌లో మీర్‌కు ఒక చెల్లి వచ్చిందని అట్లీ తన కుమారుడి తరుపు నుంచి ఇలా చెప్పుకొచ్చాడు.

రాజా రాణి, తేరి మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన అట్లీ, షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోస్ట్‌..

 

View this post on Instagram

 

A post shared by Atlee Kumar (@atlee47)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *