మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందని, సంపద కూడా వృద్ధి చెందుతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. దీని ఇంటిలో పెట్టుకోవడం వలన ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికం పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకునే క్రమంలో అస్సలే కొన్ని రకాల తప్పులు చేయకూడదంట. ముఖ్యంగా దాన్ని నాటే విషయంలో ఈ చిన్న పొరపాటు చేస్తే అది మీ జీవితాన్నే తలకిందులు చేస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ చేయకూడని తప్పు ఏదో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ప్లాస్టిక్ కుండీలలో మనీ ప్లాంట్ మొక్కను నాటుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ప్లాస్టిక్ కుండీలలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం వలన ఇది సానుకూల శక్తిని తగ్గించడమే కాకుండా ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట
అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దీనిని మురికి పాత్రలలో నాటకూడదు. ఒక వేళ మనీ ప్లాంట్ను మురికి పాత్రలలో నాటినట్లు అయితే ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఏదైనా పని చేసినా అందులో అడ్డంకులు ఏర్పడటం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో సామరస్యం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. అందుకే వీటిలో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ నాటకూడదు.
వీలైనంత వరకు మనీ ప్లాంట్ మొక్కను గాజు సీసాలో, మట్టి కుండలో నాటడం చాలా శుభప్రదం. అలాగే దీనిని ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచుకోవాలి. దీని తీగ కూడా ప్రధాన ద్వారం నుంచి కిటికీ వైపుగా పాకేలా ఉండాలి. అప్పుడే అదృష్టం కలిసి వచ్చి, ఇంటిలో సంపద పెరుగుతుంది.




