బయటకు వెళ్దామని బైక్‌ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్‌

బయటకు వెళ్దామని బైక్‌ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్‌


వేసవి తాపానికి మనుషులే కాదు మూగజీవాలూ అల్లాడిపోతున్నాయి. మనుషులకైతే ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు ఉంటాయి. మరి పశుపక్ష్యాదుల పరిస్థితి ఏంటి? చెరువులు, నీటికుంటల వద్ద సేదతీరాలి. కానీ మండుతున్న ఎండలకు అవికూడా ఎండిపోవడంతో.. చల్లదనం కోసం పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లలో ఫ్రిజ్‌లు, ఏసీలు ఇలా ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మెదక్‌ జిల్లాలో ఓ బైకర్‌ను హడలెత్తించింది ఓ నాగుపాము. కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి గ్రామానికి చెందిన జంగా ప్రశాంత్ అనే యువకుడు తన పల్సర్ బైక్ పై బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఎప్పటిలాగే బైక్ తీస్తుండగా, ఒక్కసారిగా బైక్ ముందు భాగం నుంచి వింత శబ్దం వచ్చింది. ఏదో వైర్ల సమస్య అనుకుని పరిశీలించి చూడగా.. లోపల ఏదో కదులుతున్నట్టు కనిపించింది. ఏమై ఉంటుందా అని ఓ కర్ర తీసుకొని బైక్‌ డూమ్‌పైన శబ్ధం చేశాడు ప్రశాంత్‌. అంతే లోపలి నుంచి ఒక్కసారిగా బుస్‌మంటూ నాగుపాము బయటకు వచ్చి పడగ విప్పి బుసలు కొట్టింది. ఊహించని ఈ ఘటనతో ప్రశాంత్‌కు గుండె ఆగినంత పనైంది. వెంటనే ప్రశాంత్ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పాము, డోమ్ లోపల ఇరుక్కుపోయి ఉండటంతో దానిని బయటకు తీయడం పెద్ద సవాలుగా మారింది. సుమారు అరగంట పాటు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు. బైక్ డోమ్ భాగాలను జాగ్రత్తగా విప్పి, అతి కష్టం మీద ఆ నాగుపామును బయటకు పంపించగలిగారు. అది సురక్షితంగా బయటకు వెళ్లడంతో ప్రశాంత్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. బైక్ హెడ్ లైట్ లోపల నుంచి పాము బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ పాము డోమ్ లోపలే ఉంది కాబట్టి సరిపోయింది, అదే బైక్‌పైన వెళ్తుండగా హ్యాండిల్ మీదకు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి?” అని స్థానికులు చర్చించుకుంటున్నారు. వేసవి కాలంలో చల్లదనం కోసం పాములు ఇలా ఆవాసాలు ఏర్పరచుకుంటాయని, బైక్ లేదా కారు తీసే ముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

Prakash Raj Vs Vijay: TVK చీఫ్ గాలి తీసిన ప్రకాశ్ రాజ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *