సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే చాలు రాణించడం పెద్ద కష్టం కాదు. సినిమాల్లో రాణించాలంటే అందం, కలర్, హైట్ ముఖ్యంకాదు అని చాలా మంది నిరూపించారు. వారిలో అభినయ ఒకరు.. నటి అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చిన్న వయసు నుంచి మాటలు, వినికిడి శక్తి లేని అభినయ ఎంతో అద్భుతంగా హావభావాలు పలికించగలదు..ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అభినయ. తాజాగా అభినయ తండ్రి కూడా నటుడే. ఆయన ప్రముఖ నటుడు ఆనంద్. నటి అభినయ తన తండ్రి ఆనంద్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని, తన జీవిత ప్రస్థానాన్ని, కుటుంబ బంధాలను, వృత్తిపరమైన విజయాలను పంచుకున్నారు. పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న అభినయ, అసాధారణమైన అంకితభావం, కుటుంబ మద్దతుతో నటిగా ఎదిగింది.
16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి
అభినయ తండ్రి ఆనంద్, తమ కుమార్తె ప్రతిభను గుర్తించి, ఆమెను సినిమాల్లోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందం ఇచ్చిన దేవుడు కానీ మాట ఇవ్వలేదు అని ఎమోషనల్ అయ్యారు. మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అని చాలా మంది విమర్శించినప్పటికీ, ఆయన వెనుకడుగు వేయలేదు. సంభాషణలను సిద్ధం చేయడం, షూటింగ్‌లకు ముందు నటన, హావభావాలను ప్రాక్టీస్ చేయడంలో అభినయ తల్లి నిరంతరం ఆమెకు సహాయం చేస్తారు. తండ్రి ఆనంద్ షెడ్యూల్స్, కథల ఎంపిక వంటి విషయాలను చూసుకుంటారు. సముద్రఖని తన సినీ ప్రస్థానంలో గాడ్‌ఫాదర్‌గా ఉన్నారని అభినయ తెలిపారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన లేకుంటే తాను సినీ రంగంలోకి వచ్చేదాన్ని కాదన్నారు.
అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..
అభినయ తన వినికిడి లోపాన్ని ఎప్పుడూ ఒక లోపంగా భావించలేదని, అది తనకు సహజమైన విషయమని ఆనంద్ చెప్పారు. ఆమె బాల్యంలో మూడు సంవత్సరాల వరకు నడవలేకపోయినప్పటికీ, ఆ తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు. డెఫ్ అండ్ డమ్బ్ అనే పదాన్ని తప్పుగా భావిస్తారు, వినికిడి లోపం ఉన్నంత మాత్రాన మాట రాదని, సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తే మూగవారు అవుతారని వివరించారు ఆనంద్. రజినీకాంత్ వంటి దిగ్గజాలు తన నటనను ప్రశంసించారని, అలాగే శివకుమార్ (సూర్య తండ్రి), అల్లు అర్జున్, మహేష్ బాబు, వెంకటేష్ వంటి నటులతో తన అనుభవాలను పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి