వాట్సాప్ తన వినియోగదారుల కోసం స్టేటస్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫిచర్‌ను ఉపయోగించి యూజర్లు తమ స్టేటస్ అప్డేట్లను ఎవరు చూడాలి ఎవరు చూడవద్దు అని ఎంచుకోవచ్చు. అంటే యూజర్లు తమకు నచ్చిన వ్యక్తులతో ప్రత్యేక జాబితాలను సెట్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ మాదిరిగానే ఈ వాట్సాప్ ఫీచర్స్ కూడా పనిచేస్తుంది. దీనివల్ల ప్రతిసారీ సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేకుండా, నేరుగా సంబంధిత లిస్ట్‌తో స్టేటస్ షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీ మరింత పెరుగుతుంది. మనం షేర్ చేసే ఫోటోలు లేదా వీడియోలు కేవలం మనం కోరుకున్న వారికి మాత్రమే కనిపిస్తాయి.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వెర్షన్లలో 'డెవలప్మెంట్ స్టేజ్'లో ఉంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ పేర్కొంది.
ప్రస్తుతానికి వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ కోసం మనకు మూడు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మై కాంటాక్ట్స్.. ఇది మీ ఫోన్లో సేవ్ అయి ఉన్న అందరికీ స్టేటస్ కనిపిస్తుంది. ఇంకోటి మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఇది మీరు ఎవరినైతే వద్దనుకుంటున్నారో, వారిని మినహాయించి మిగిలిన వారికి కనిపించేందుకు యూజ్ అవుతుంది. ఇక చివరిగా ఓన్లీ షేర్ విత్ మీరు ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే స్టేటస్ కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు కొత్తగా రాబోయే స్టేటస్ లిస్ట్ ఫీచర్ ద్వారా ఈ ఇది మరింత సులభతరం, వ్యక్తిగతం కానుంది. దీనివల్ల యూజర్లు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు గ్రూపుల కోసం మల్టిపుల్ లిస్టులను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.




