Tollywood : వాటే మేకోవర్ భయ్యా.. అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరం..

Tollywood : వాటే మేకోవర్ భయ్యా.. అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరం..


పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? తెలుగు సినీరంగంలో బాలనటిగా తనదైన ముద్ర వేసింది. తక్కవ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ముఖ్య పాత్ర పోషించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తన పేరు శ్రియ శర్మ. తెలుగులో బాలనటిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ మూవీతో ఫేమస్ అయ్యింది. సమీరా రెడ్డి, భూమిక హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో చిరు మేనకోడలిగా కనిపించింది. ఈ సినిమాలో చిరు, శ్రియ శర్మ కామెడీ, యాక్టింగ్, బాండింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఐదారేళ్ల వయసులోనే పలు యాడ్స్ చేసింది. జై చిరంజీవ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసింది. తెలుగులో మహేష్ బాబు దూకుడు, రామ్ చరణ్ రచ్చ, నాని ఎటో వెళ్లిపోయింది మనసు వంటి చిత్రాల్లో నటించింది. కేవలం బాలనటిగా కాకుండా కథనాయికగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు అంతగా బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ చదువుపై ఫోకస్ పెట్టింది. 2016లో చివరగా నిర్మాలా కాన్వెంట్ చిత్రంలో కనిపించింది.

ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ శర్మ.. ఇప్పుడు రచయితగా మారింది. కర్మ బ్యాక్ ఫైర్డ్ అనే బుక్ రాసింది. ఇటీవలే 29వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఆమె.. తన బర్త్ డేను సంతోషంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పటివరకు 150కి పైగా యాడ్స్ చేసింది శ్రియ శర్మ.

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

ఎక్కువ మంది చదివినవి : Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *