Ram Charan : సర్.. నాకు మరో అవకాశం ఇవ్వండి.. రామ్ చరణ్‏కు డైరెక్టర్ బుచ్చిబాబు రిక్వెస్ట్..

Ram Charan : సర్.. నాకు మరో అవకాశం ఇవ్వండి.. రామ్ చరణ్‏కు డైరెక్టర్ బుచ్చిబాబు రిక్వెస్ట్..


మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ జాన్వీ కపూర్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బుచ్చిబాబు, రామ్ చరణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా రామ్ చరణ్ ఎస్క్వైర్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై చరణ్ స్టైలీష్ లుక్స్ సైతం పబ్లిష్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..

ఇక తాజాగా చరణ్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ఎస్క్వైర్ ఇండియా పోస్ట్ చేసింది. అందులో చరణ్ బాడీ, లుక్స్, మేకోవర్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నాయి. ముఖ్యంగా చరణ్ స్టైలీష్ లుక్స్ పై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సన సైతం ఆసక్తికర కామెంట్ చేశారు. “సర్.. మరో అవకాశం ఇవ్వండి” అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం నెట్టింట వైరలవుతుంది. దీంతో పెద్ది తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

బుచ్చిబాబు, రామ్ చరణ్ మధ్యలో ఈసారి గ్యాంగ్ స్టర్ సినిమా రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ పక్కా ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటల సూపర్ హిట్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *