Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..


మన ఇంటి తోటలో లేదా బాల్కనీలో పవిత్రమైనదిగా, ఆరోగ్యానికి మేలు చేసేదిగా భావించే తమలపాకు మొక్కను పెంచుకోవడం చాలా సులభం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ మొక్క అడవిలా గుబురుగా పెరుగుతుంది. దీని సంరక్షణకు సంబంధించి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. తమలపాకు మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఎండ తగిలితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాల్కనీలో ఎండ తక్కువగా ఉండే చోట లేదా పెద్ద మొక్కల నీడలో దీనిని ఉంచాలి. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది. తీర ప్రాంతాల్లో సహజంగానే తేమ ఉంటుంది కాబట్టి అక్కడ ఇది బాగా పెరుగుతుంది. పొడి వాతావరణం ఉన్న చోట మొక్క చుట్టూ నీటిని చిలకరించడం ద్వారా తేమను పెంచవచ్చు.

ఈ మొక్కకు నీరు నిల్వ ఉండని మట్టి మిశ్రమం అవసరం. 40 శాతం సాధారణ మట్టి, 20 శాతం ఎరువు, 20 శాతం కోకోపీట్, 20 శాతం ఇసుక కలిపి కుండీని సిద్ధం చేసుకోవాలి. కుండీలోని మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి కానీ నీరు నిలవకూడదు. మట్టి పూర్తిగా ఎండిపోతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. కాబట్టి క్రమం తప్పకుండా నీరు పోయాలి. తమలపాకు ఆకులతో నిండిన మొక్క కాబట్టి దీనికి నైట్రోజన్ ఎక్కువగా అందాలి. మనం ఈ ఆకులను నేరుగా తింటాం కాబట్టి రసాయన ఎరువులను అస్సలు వాడకూడదు. ఆవు పేడ ఎరువు లేదా వర్మికంపోస్ట్ రెండు నెలలకు ఒకసారి ఇవ్వాలి. ఒక గుప్పెడు ఎరువును నీటిలో నానబెట్టి, ఆ ద్రవాన్ని నెలకు ఒకసారి పోస్తే ఆకులు పచ్చగా, పెద్దగా పెరుగుతాయి.

మొక్క గుబురుగా పెరగాలంటే పైకి పాకుతున్న తీగ చివర్లను కత్తిరిస్తూ ఉండాలి. దీనివల్ల కింద నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా మారుతుంది. ఇది తీగ జాతి మొక్క కాబట్టి పాకడానికి ఒక కర్ర లేదా మోస్ స్టిక్ సపోర్ట్ ఇవ్వాలి. దీనివల్ల ఆకులు త్వరగా పెద్దవవుతాయి. తమలపాకు మొక్కను మనీ ప్లాంట్ లాగే కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు. కణుపు దగ్గర వేరు ఉన్న కొమ్మను కట్ చేసి నీటిలో గానీ, మట్టిలో గానీ నాటితే కొద్ది రోజుల్లోనే కొత్త మొక్క సిద్ధమవుతుంది. అడుగున ఉన్న పాత ఆకులను కోసుకుని వాడుకుంటే, పై నుంచి కొత్త చిగుర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లోనే తాజాగా, ఆరోగ్యకరమైన తమలపాకులను నిత్యం అందుకోవచ్చు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *