4 రోజులుగా ఆమె కనిపించలేదు.. ఇంటికి తాళం లేదు.. అనుమానమొచ్చి తలుపులు పగలగొట్టగా

4 రోజులుగా ఆమె కనిపించలేదు.. ఇంటికి తాళం లేదు.. అనుమానమొచ్చి తలుపులు పగలగొట్టగా


సిటీ లైఫ్ ఎంత వేగంగా పెరుగుతోందంటే.. మన పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేనంత స్థాయికి చేరింది. బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో పలు విచారకరమైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక అద్దె ఇంట్లో మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం, బెంగళూరులోని ఆడుగోడి ప్రాంతంలో జార్ఖండ్‌కు చెందిన 34 ఏళ్ల పూజా దత్తా అనే మహిళ అద్దె ఇంట్లో నివాసముంటోంది.

పూజా దత్తా గత మూడేళ్లుగా ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. అయితే, ఆమె ఇంట్లో నుంచి గడిచిన నాలుగైదు రోజులుగా విపరీతమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. తీరా పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూసేసరికి, అక్కడ కనిపించిన దృశ్యం అత్యంత దారుణంగా ఉంది. ఆమె మృతదేహం దుస్తులు లేకుండా, పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో రక్తపు మడుగులో ఉంది. ప్రాథమిక విచారణలో ఆమె గదిలో కొన్ని కాగితాలు చింపేసి ఉండటం, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఇది గమనిస్తే ఆత్మహత్య కాదని, ఎవరో పథకం ప్రకారం చేసిన హత్య కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం, పూజాను కలవడానికి తరచుగా ఒక యువకుడు వచ్చేవాడని, వారి మధ్య తరచుగా గొడవలు జరిగేవని తెలుస్తోంది. అలాగే ఆమెను ఏప్రిల్ 23న సరుకులు తీసుకోస్తుండగా చివరిసారిగా చూశానని ఓనర్ చెప్పింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *