వాలంటీర్లు చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో కలిసి వెళ్లకూడదని, పశువుల ఫోటోలు తీయడం లేదా నిందితుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి పనులు చేయరాదని సూచించారు. పోలీసులతో సమన్వయం కోసం ప్రతి సంఘం ఒక ప్రతినిధిని, సభ్యుల ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేయాలని, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు.
తనిఖీల పేరుతో గోరక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులు ఉంచుకోకూడదని, పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించడం లేదా దారిలో అడ్డంకులు సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.