లోపలి నుండి హైడ్రేషన్.. ముఖంపై మెరుపు: వేసవిలో చెమట రూపంలో శరీరం నుండి నీరు, ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోతాయి. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తాయి. దీని ప్రభావం మీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. 30 రోజుల పాటు క్రమంగా తాగడం వల్ల చర్మం పొడిబారడం తగ్గి, సహజమైన మెరుపు వస్తుంది.