
2027 సంక్రాంతి పండుగ సినీ అభిమానులకు డబుల్ ధమాకాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర తారలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలోకి దిగితే అభిమానులకు పండగే అవుతుంది. అయితే, దీని వల్ల లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియర్ హీరోలకు సంక్రాంతికి రావడం అలవాటు. గత సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు పోటీపడ్డాయి. ఇప్పుడు 2027 సంక్రాంతికి కూడా ఈ సెంటిమెంట్ కొనసాగేలా ఉంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే జనవరి 15న విడుదలకు ఖరారు కాగా, బాలకృష్ణ – విజయ్ కనకమేడల, చిరంజీవి – బాబీ చిత్రాలు కూడా పండగనే లక్ష్యంగా చేసుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్
బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు
ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్
పొంగల్ పోటీ చూసారా.. ఈసారి దండయాత్రే..
Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్