Headlines

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా


దక్షిణాది ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నజ్రియా నజీమ్, 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తెలుగులో సినిమాలు చేసినప్పటికీ, తమిళంలో మాత్రం ఆమె చాలా కాలం కనిపించలేదు. తాజాగా సూర్య హీరోగా వచ్చిన సీన్ చిత్రంతో ఆమె కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.ఈ 12 ఏళ్ల విరామంపై నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలకు తాను కావాలనే దూరంగా ఉండలేదని, తనపై తమిళ ప్రేక్షకులు చూపిన ప్రేమకు, ఒక ప్రత్యేకమైన, బలమైన పాత్రతోనే రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూశానని తెలిపారు. ఈ క్రమంలోనే మంచి కథ కోసం వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు జిత్తు మాధవన్ చెప్పిన కథ, అందులోని తన పాత్ర నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించానని నజ్రియా వెల్లడించారు. కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి నటించడం తన కమ్ బ్యాక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇకపై తమిళంలో వరుసగా మంచి సినిమాలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌కి తప్పని వెయిటింగ్‌..

నవంబర్, డిసెంబర్ నెలల్లో బాక్సాఫీస్ పై చిన్న సినిమాల దండయాత్ర

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్ Vs రణవీర్ సింగ్..

రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *