Headlines

హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..


హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్‌ పరిధిలో సాయంత్రం నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ సహా.. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. హైదరాబాద్‌ నగరంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 6:10 నుంచి 7:20 గంటల మధ్య కోర్ సిటీలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, పశ్చిమ హైదరాబాద్‌ను వానలు ముంచెత్తడంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని నగరవాసులకు అధికారుల సూచనలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *