Headlines

Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..

Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..


మా ఇంటి బంగారంతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సమంతకు మళ్లీ మేజర్ బ్రేక్ తప్పదా..? ఆల్రెడీ మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ బ్యూటీ.. ఈసారి అంతకుమించిన బ్రేక్ తీసుకోబోతున్నారా..? అసలు స్యామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మళ్లీ ఎప్పుడు ఉండబోతుంది..? ఈమె స్క్రీన్ మీదకు మళ్లీ ఎప్పుడు రాబోతున్నారు..? సమంత ఫ్యూచర్ ప్లాన్స్‌పై స్పెషల్ స్టోరీ.. సైలెంట్ సెన్సేషన్ అంటారు కదా.. మా ఇంటి బంగారంతో బాక్సాఫీస్ దగ్గర సమంత చేసిందిదే. పెద్దగా అంచనాల్లేకుండానే వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా 100 కోట్ల క్లబ్బులో చేసి అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. రాజ్ నిడిమోరు కథ అందించిన ఈ సినిమాను తనదైన స్టైల్‌లో తెరకెక్కించారు నందిని రెడ్డి. ఈ హిట్ ఇచ్చిన ఉత్సాహంలో సమంత మళ్లీ వరసగా సినిమాలు చేస్తారేమో అనుకున్నారు ఫ్యాన్స్.. కానీ ఈమె వ్యక్తిగత జీవితంలో మరో మైలురాయి వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్నెన్సీ కారణంగా కనీసం రెండేళ్లకు పైగానే తాను సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు స్యామ్. 2027లో కమ్ బ్యాక్ అంటున్నారు కానీ పరిస్థితులు చూస్తుంటే 2028లో కానీ సమంత మళ్లీ స్క్రీన్‌పై కనిపించడం కష్టమే. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. డిజిటల్ ఆడియన్స్‌కు మాత్రం దగ్గరగానే ఉంటున్నారు స్యామ్. ఈ మధ్యే ఓ ప్రముఖ ఓటిటి సంస్ధతో రియాలిటీ షో కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. గతంలో ఆహాలో స్యామ్ జామ్ అనే షో చేసారు సమంత. అలాగే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా చేసారు. మొత్తానికి సినిమాలకు బ్రేకిచ్చినా.. ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నారీమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *