Headlines

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌


అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ప్రముఖ సంస్థ స్పేస్‌ఎక్స్ మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇటీవల ప్రయోగించిన అతిభారీ ‘స్టార్‌షిప్‌’ వ్యోమనౌక ప్రయోగం అనంతరం హిందూ మహాసముద్రంలో క్షేమంగా తేలుతోంది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ అధికారికంగా ధ్రువీకరించింది. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే క్రమంలో సముద్రంలో ల్యాండ్ అయిన ఈ వ్యోమనౌకను దెబ్బతినకుండా రికవరీ చేయడానికి తమ ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయోగం తర్వాత నియంత్రణ లేని రీతిలోనే సముద్రంలో దిగినప్పటికీ, అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తకపోవడం గమనార్హం. దెబ్బతినకుండా తేలుతున్న ఈ స్టార్‌షిప్‌ను తిరిగి తీసుకురావడానికి ఒక ప్రత్యేక రికవరీ నౌకను పంపుతున్నట్లు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. రోదసి వాహనాలను పదేపదే వినియోగించేలా తీర్చిదిద్దే తమ సుదీర్ఘ ప్రయత్నాలలో ఇది అత్యంత కీలకమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత భూ వాతావరణంలోకి పునఃప్రవేశించే సమయంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి, వేడిని ఈ వ్యోమనౌక ఎలా తట్టుకుందో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. దీని నిర్మాణం, హీట్ షీల్డ్, ఆన్‌బోర్డ్ వ్యవస్థల పనితీరును అంచనా వేసేందుకు రికవరీ బృందం చిత్రాలు, సమాచారాన్ని సేకరిస్తోంది. చంద్రుడు, అంగారకుడు మరియు ఇతర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్‌ఎక్స్ ఈ రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. సూపర్‌ హెవీ బూస్టర్‌తో కలిపితే దీని ఎత్తు ఏకంగా 123 మీటర్లు ఉంటుంది. భవిష్యత్తులో వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకెళ్లే నాసా ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ కార్యక్రమంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. గతంలో చేపట్టిన పరీక్షల సమయంలో నమూనాలు ధ్వంసం కాగా, ఈసారి ప్రయోగం ముగిసిన తర్వాత కూడా రాకెట్ సముద్రంలో సజీవంగా తేలుతూ ఉండటం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్!

వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!

రైలు ఇంజిన్‌ చెక్‌ చేస్తున్న పైలట్‌.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్‌

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *