Headlines

స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..


స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై దుర్భాషలాడుతూ వ్యాఖ్యానించడం సరికాదంటూ మండిపడ్డారు.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సంయమనం పాటిస్తుంది..దాన్ని చేతగానితనంగా భావించొద్దంటూ హితవు పలికారు. స్పీకర్‌ పట్ల ఈ భాషను ప్రయోగించినందుకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. మాట్లాడిన సభ్యుడిని తక్షణమే డిస్మిస్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము ఏం చేసినా చూసుకునే తమ నాయకుడు ఉన్నాడన్న అహంకారంతో అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి గాయమైందని..సభాపతిని ఇంత దారుణంగా దూషంచడాన్ని ఎవరూ ఒప్పుకోరన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద నేరమంటూ సీఎం వ్యాఖ్యానించారు.

ఏ చట్టసభలోనూ ఇంత అభ్యంతరకర భాషను వాడలేదు.. నా 20 ఏళ్ల అనుభవంలో.. 80ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ఇలాంటి భాషను ఎక్కడా వాడలేదు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్షమించి ఊరుకుంటే చట్టసభలకు విలువ ఉండదు కాబట్టి.. క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేస్తున్నానన్నారు. తక్షణమే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని.. సభ్యులు ఎవరున్నా దీనిపై స్పందించాలని సీఎం సూచించారు.

స్పీకర్, మంత్రి భావోద్వేగం..

స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు మండలి సభ్యులు బూతులు మాట్లాడారన్నారు. తాతా మధు, నవీన్ మీద చర్యలు తీసుకోవాలని.. వీధుల్లో కొట్లాడినట్లు.. అసెంబ్లీ ముందు ప్రవర్తించారంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే ఈ వ్యవహారం జరిగిందని సీతక్క పేర్కొన్నారు. సభలో ప్రసంగిస్తూ మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు.. స్పీకర్ స్థానాన్ని అవమానించడం సరికాదన్నారు.. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.. కూర్చీలో ఉండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు.

వీడియో చూడండి..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *