Headlines

స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా?

స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా?


మన హీరోలు మరీ నల్లపూసలైపోతున్నారు. పేరుకు ప్రతీ ఒక్కరి చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నా.. అవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయడిన్స్‌ ముందుకు వచ్చేసరికి మాత్రం ఏళ్లకు ఏళ్లు గడిపోతున్నాయి. టాప్ హీరోలు ప్రైమ్ కెరీర్‌లో ఇలా ఆలస్యం చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఆ డిలేకు కారణమేంటి..? పాన్ ఇండియా ట్రెండే కారణమా..? లేక మన హీరోల ప్లానింగ్ లోపమా? 2024 చివర్లో పుష్పరాజ్‌గా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్‌, ఆ తరువాత మళ్లీ తెర మీద కనిపించలేదు. షార్ట్ గ్యాప్ తరువాత అట్లీ దర్శకత్వంలో ఏఏ 22 సినిమాను పట్టాలెక్కించిన బన్నీ, ఈ ఏడాది కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. మహేష్‌ గుంటూరు కారం సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటిపోయింది. నెక్ట్స్ మూవీ రిలీజ్‌ 2027 ఏప్రిల్‌లోనే అని ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు. అంటే మూడేళ్ల తరువాతే మహేష్ తెర మీదకు వస్తారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర కూడా 2024లోనే రిలీజ్ అయ్యింది. ఆ తరువాత తారక్‌ వార్ 2 మూవీలో నటించినా.. ఆ ప్రాజెక్ట్‌ను సౌత్ ఆడియన్స్ ఓన్‌ చేసుకోలేదు. అంటే తారక్‌ కాంపౌండ్ నుంచి కూడా కరెక్ట్ ప్రాజెక్ట్ వచ్చి రెండేళ్లు దాటినట్టే. ఇలా స్టార్ హీరోలంతా రెండు మూడేళ్లు బ్రేక్ తీసుకుంటుండటంతో బాక్సాఫీస్ కళతప్పుతోంది. ఈ ఆలస్యానికి కారణం ఏంటన్న విషయంలోనూ రకరకాల వాదలను వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ కాస్టింగ్‌, అంతకు మించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తెరకెక్కిస్తుండటంతో ఆ ప్రాజెక్ట్స్‌ ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా టైమ్‌ పడుతోంది. ఎక్కవ మంది స్టార్స్‌ రెగ్యులర్‌గా సినిమాలు రిలీజ్ చేయకపోవడానికి ఇదే మెయిన్‌ రీజన్‌ అన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ, హిందీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఆన్‌ టైమ్ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాయి. అక్కడ టాప్ స్టార్స్‌ కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. కానీ మన హీరోలకు మాత్రం ఆ స్పీడు సాధ్యం కావటంలేదు. ఈ ఆలస్యానికి నిజంగానే పాన్ ఇండియా ట్రెండే కారణమా..? లేక మన హీరోల ప్లానింగ్ లోపం కూడా ఉందా.? ఇదే ఇప్పుడు ఆడియన్స్‌కు అర్ధం కాని మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్

కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *