Headlines

సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే.. అలాంటి వాటిని కట్టడి చేయండి..


సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే.. అలాంటి వాటిని కట్టడి చేయండి..

నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ గణనీయంగా ఉంది. కష్టమైన పనులను సులభతరం చేస్తూనే, ఇది కొత్తరకం మోసాలకు దారి తీస్తోంది. ఏఐని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు నకిలీ ఆడియోలు, వీడియోలు, డీప్‌ఫేక్‌లను సృష్టించి వ్యక్తులను మోసం చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ ముప్పు సెలబ్రిటీలకే కాకుండా, సామాన్య ప్రజల ప్రాణాలకు, పరువుకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ తీవ్రమైన సమస్యపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సినీ పరిశ్రమకే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి డిజిటల్ భద్రత కోసం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలని కోరారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిశారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ నకిలీ గుర్తింపులకు వ్యతిరేకంగా మరింత పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని కోరుతూ కిషన్ రెడ్డికి అధికారికంగా వినతి పత్రం సమర్పించారు. సాంకేతికత సృజనాత్మకతకు ఉపయోగపడాలి తప్ప, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించకూడదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. డీప్‌ఫేక్ మోసాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ మార్కెట్‌లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్

దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?

హీరోయిన్లకు అగ్నిపరీక్ష… ఎవరికి కలిసొస్తుంది?

స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *