Headlines

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు


సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ఆధ్వర్యంలో సౌదీ నేషనల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాటా సభ్యులు, పాల్గొని సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సౌదీ అరేబియాలో ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన భారతీయులుగా, సౌదీ ప్రజలతో కలిసి మమేకమై, పరస్పర గౌరవం మరియు స్నేహభావంతో ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉందని సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ తెలిపారు. ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ, “మనం భారతీయులమైనప్పటికీ సౌదీ అరేబియా మనకు ఉపాధి, అవకాశాలను అందిస్తున్న మరో ఇల్లులాంటిది. ఇక్కడి ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తూ, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం. సౌదీ సమాజంలో భారతీయులు తమ కృషి, నిబద్ధతతో మంచి పేరు సంపాదించుకోవడం భారతీయుడిగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది” అని అన్నారు. భారతీయులు సౌదీ అరేబియా అభివృద్ధిలో తమ వంతు పాత్రను కొనసాగిస్తూ, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాటా ఉమెన్స్ ప్రెసిడెంట్ శ్రీమతి శర్వాణి విద్యాధరాణి, సాటా కోర్ టీమ్ సభ్యులు, కోకిల ఒతులూరి, అర్షియా బేగం, నరేష్ కుమార్ సింగు, యోగేశ్వరా రావ్ వీరవల్లి, అహ్మద్ అబ్దుల్ కరీమ్, మిధున సురేష్, మహమ్మద్ నూరద్దీన్, ఖాజా ముజామిలోద్దీన్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తల్లా, అహ్మద్ అస్లాం, పెంటపాటి శ్రీచరణ్, దూడం సంజీవ్, శేఖర్ పడాల, చింతమల్ల దీపక్ కుమార్, ప్రకాష్, శ్రీని హ్యూమానిటీ సర్వీసెస్ అధ్యక్షులు దూడం సంజీవ్ మరియు జనరల్ సెక్రటరీ ముహమ్మద్ అబ్దుల్ గఫ్ఫార్, టాసా ఫౌండర్ తిరుపతిస్వామి స్వర్ణ సౌదీ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Super El Nino: సూపర్‌ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఫిబ్రవరి లోపు 4.5 లక్షల మరణాలు!

సంజూ శాంసన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *