బయట ఎండలు మండిపోతున్నాయి. అడుగుబయట పెట్టాలంటేనే భయపడతే పరిస్థితులు నెలకొన్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవులు, క్షీరదాలు ఈ ఎండకు తట్టుకోలేక అల్లాడి పోతుంటాయి. ఈ క్రమంలోనే చల్లదనం కోసం పాములు వంటివి జనావాసాల్లోకి లేదా పరిసరాలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని దూరంగా ఉంచడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మీరు ఎప్పుడూ ఇంటి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సమ్మర్‌లో పాములు వంటివి మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మొదట మీ ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, పొదలు లేకుండా చూసుకోవాలి. ఎండుటాకులు, చెత్తాచెదారం ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోండి. అలాగే గోడలకు లేదా నేల మీద ఉన్న పగుళ్లు, రంధ్రాలను సిమెంట్ లేదా మట్టితో మూసివేయండి. అలాగే కట్టెలు, పాత సామాన్లు నేల మీద కాకుండా కాస్త ఎత్తులో సర్ది ఉంచండి. బట్టలు లేదా షీట్లను కుప్పలుగా వేయకుండా జాగ్రత్తగా సర్దుకోండి
మీ ఇంటి పరిసరాల్లో పార్క్ చేసిన స్కూటర్లు, కార్లు, షూస్, పిల్లోస్ వంటి వాటిలో పాములు నక్కి ఉండే అవకాశం ఉంది. కాబట్టి షూస్ వేసుకునే ముందు, వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయండి. అలాగే రాత్రి వేళల్లో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచకండి. వీలైతే నెట్స్ అమర్చుకోండి. అంతేకాదు ఏదైనా వస్తే కనిపించేలా ఇంటి బయట రాత్రిపూట వెలుతురు ఉండేలా చూసుకోండి.
పాము కాటు వేస్తే ఏం చేయాలి?
ఒకవేళ పొరపాటున పాము కాటు వేస్తే భయపడకుండా వెంటనే ఇలా చేయండి. ఒకవేళ కాలిపై పాము కాటు వేస్తే అస్సలు నడవకండి. ఎదుకంటే శరీరం ఎంత ఎక్కువ కదిలితే విషం అంత వేగంగా రక్తంలో కలుస్తుంది. అయితే రక్తం వ్యాపించకుండా ఉండాలంటే గాయం అయిన చోటుకు కొంచెం పైన గుడ్డతో లేదా తాడుతో మరీ గట్టిగా కాకుండా కట్టు కట్టాలి. ప్రతి అరగంటకు ఒకసారి ఆ కట్టును కాసేపు వదులు చేస్తూ మళ్ళీ కడుతూ ఉండాలి.
ఇంకో ముఖ్యమైన విషయం పాము కాటుకు గురైన వ్యక్తిని అస్సలు పడుకోబెట్టకూడదు. ఒకవేళ పడుకోబెట్టాల్సి వస్తే పక్కకు ఒరిగి పడుకోబెట్టాలి. గాయం అయిన భాగం గుండె కంటే తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు పాము కాటు వేస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. భయం వల్ల రక్తపోటు పెరిగి విషం వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితుడికి ధైర్యం చెప్పడం చాలా ముఖ్యం. అయితే నాటు వైద్యం లేదా మంత్రాల వంటి వాటిని నమ్మి సమయాన్ని వృథా చేయడం మంచిది కాదు. తక్షణ వైద్య సహాయమే ప్రాణాలను కాపాడుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.