5. అన్ని ఫార్మాట్లలో మూడుకు పైగా సెంచరీలు: టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా మూడు విభాగాల్లోనూ కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ బ్యాటర్ రోహిత్ శర్మ. టెస్టుల్లో 12, టీ20ల్లో 5, వన్డేల్లో 33 సెంచరీలు సాధించి అన్ని ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.