సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా వస్తాయో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పల్లీలు, పచ్చి మిర్చి, బంగాళ దుంపలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఈ సింపుల్ పదార్థాలతోనే చాలా అంటే చాలా సులభంగా సగ్గు బియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చును.
తయారీ విధానంలోకి వెళితే : ముందుగా సగ్గు బియ్యం తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బంగాళ దుంపలను ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత మంచి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పల్లీల పొడి, ఉడికించిన సగ్గు బియ్యం, పచ్చి మిర్చీ , కొత్తి మీర, ఉప్పు, జీలకర్ర ఇలా అన్ని పదార్థాలు వేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో వడలు వేయించడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. వాిని చిన్న చిన్నగా వడల్లా ఒత్తుకోవాలి.
తర్వాత వాటిని నూనెలో వేసి మంచిగా కాల్చుకోవాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత వాటిని ఆయిల్ నుంచి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ వేడి వేడి సగ్గు బియ్యం వడలు రెడీ, మరి మీరు కూడా ట్రై చేయండి.




