Headlines

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ? అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ


ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయితే డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా… ఒక ఇంటర్వ్యూ లో.. ఆనంద్‌ దేవరకొండ పలు ఆసక్తి కరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో వైష్ణవి చైతన్యతో తనకి లవ్ ఉందన్న వార్తలకి ఎండ్ కార్డ్ వేస్తూ తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు మన చిన్న దేవరకొండ. ఆనంద్ తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ.. వైష్ణవితో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశాడు. అసలు ఈ రూమర్స్ ఎలా పుట్టాయో తెలీదని , తామిద్దరం కేవలం మంచి స్నేహితులమన్నాడు. వైష్ణవి ఇంకా చాలా చిన్న పిల్ల.. అని.. ఆమెకు వయసు 24 ఏళ్లే… అని.. తన కెరీర్ ఇప్పుడే మొదలైంది, సాధించాల్సింది చాలా ఉంది. తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉందంటూ ఆనంద్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, తన ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ఉందనే విషయాన్ని ఒప్పుకున్న ఆనంద్.. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ రూమర్లతో తనను, వైష్ణవిని పోలుస్తూ సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, వార్తలను అసలు తాను పట్టించుకోనని చెప్పాడు. సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటానని, దాని వల్ల నెగెటివిటికి దూరంగా ఉండొచ్చని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్‌!

తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!

పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం

పుట్టగానే పాస్‌పోర్ట్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *