Headlines

వాషింగ్ మెషీన్‌లో బట్టలు చిక్కు పడుతున్నాయా? ఈ సింపుల్ హ్యాక్‌తో ఆ తలనొప్పికి చెక్ పెట్టండి!


ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ వినియోగం చాలా సాధారణమైపోయింది. బట్టలు ఉతకడం సులభమే అయినప్పటికీ, ఉతికిన తర్వాత వాటిని బయటకు తీయడమే ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది. షర్టులు, ప్యాంట్లు, చున్నీలు, చీరలు ఒకదానికొకటి చుట్టుకుపోయి పెద్ద ముడిలా తయారవుతాయి. వాటిని విడదీసే క్రమంలో దుస్తులు సాగిపోవడం, చిరిగిపోవడం, బటన్లు ఊడిపోవడం లేదా ఐరన్ చేయడం కష్టమయ్యేలా ముడతలు పడటం మనం నిత్యం చూస్తుంటాం. ఈ చిక్కుల సమస్య నుంచి విముక్తి పొందడానికి ఒక వినూత్నమైన, చౌకైన హ్యాక్ అందుబాటులోకి వచ్చింది. అదే సిలికాన్ లాండ్రీ బాల్స్.

సిలికాన్ లాండ్రీ బాల్స్ ఎలా పనిచేస్తాయి?:

ఇవి మెత్తటి సిలికాన్ లేదా రబ్బర్ పదార్థంతో తయారుచేసిన చిన్న పరిమాణపు బంతులు. మీరు వాషింగ్ మెషీన్‌లో ఉతకడానికి బట్టలు వేసేటప్పుడు, వాటితో పాటు 4 నుండి 6 సిలికాన్ బాల్స్‌ను లోపల వేయాలి. మెషీన్ తిరుగుతున్నప్పుడు, ఈ బాల్స్ నిరంతరం బట్టల మధ్య కదులుతుంటాయి. దీనివల్ల బట్టలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చుట్టుకుపోకుండా లేదా ముడిపడిపోకుండా ఈ బాల్స్ అడ్డుగోడలా పనిచేస్తాయి.

లాండ్రీ బాల్స్ వల్ల కలిగే ఉపయోగాలు:

ముడతలు తగ్గుతాయి: బట్టలు ఒకదానికొకటి గట్టిగా చుట్టుకోకపోవడం వల్ల వాటిపై ఎక్కువ ముడతలు పడవు. దీనివల్ల ఐరన్ చేసుకునే పని కూడా తేలికవుతుంది.

ఇవి కూడా చదవండి



ఉత్తమమైన క్లీనింగ్: మెషీన్ తిరిగేటప్పుడు ఈ బాల్స్ బట్టలపై రుద్దుకోవడం వల్ల దుస్తుల్లోని మురికి, మరకలు త్వరగా వదిలిపోతాయి.

బట్టల ఆయుష్షు పెరుగుతుంది: బట్టలను బలవంతంగా లాగి విడదీసే అవసరం ఉండదు.. కాబట్టి, ఫ్యాబ్రిక్ పాడవకుండా దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి.

ఎక్కడ దొరుకుతాయి? ధర ఎంత?

ఈ సిలికాన్ లాండ్రీ బాల్స్ ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అయిన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలతో పాటు బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో సులభంగా లభిస్తాయి. ఆఫ్‌లైన్‌లో అయితే డి-మార్ట్, రిలయన్స్ స్మార్ట్ లేదా స్థానిక హోమ్ యుటిలిటీ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. 4 నుండి 8 బాల్స్ ఉండే ప్యాక్ సాధారణంగా రూ.99 నుండి రూ.200 రూపాయల బడ్జెట్‌లోనే దొరుకుతుంది. రీయూజబుల్ కాబట్టి వీటిని ఏళ్ల తరబడి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *