Headlines

వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!

వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!


వర్షం నీళ్లు నేరుగా జుట్టు రాలడానికి కారణం కాదు. అసలు సమస్య వర్షంలో తడిచిన తర్వాత జుట్టును సరిగ్గా శుభ్రం చేయకపోవడం, ఎక్కువసేపు తడిగానే ఉంచడం వల్ల మొదలవుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు త్వరగా ఆరదు. దీంతో దుమ్ము, ధూళి, కాలుష్య కణాలు తలకు సులభంగా అంటుకుని తల చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం.. నగరాల్లో కురిసే వర్షపు నీరు పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. పారిశ్రామిక కాలుష్యం, వాహనాల నుంచి వెలువడే పొగ, గాలిలోని రసాయనాలను కలుపుకుని వర్షపు నీరు కొంత ఆమ్ల స్వభావాన్ని సంతరించుకోవచ్చు.

ఇలాంటి నీరు తల చర్మంపై ఎక్కువసేపు ఉంటే తల చర్మం pH సమతుల్యత దెబ్బతినవచ్చు. దురద, చుండ్రు సమస్యలు రావచ్చు. తల చర్మం చికాకు చెందవచ్చు. జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలే అవకాశం పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల తల చర్మం ఎక్కువసేపు తడిగా ఉంటుంది. ఇది ఫంగస్, బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చుండ్రు సమస్య తీవ్రమవుతుంది. జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. జుట్టు రాలడం ఎక్కువ కావచ్చు.

తడి జుట్టుతో చేసే పొరపాట్లు

  • వర్షంలో తడిసిన వెంటనే చాలామంది చేసే కొన్ని అలవాట్లు కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి.
  • తడి జుట్టును గట్టిగా కట్టడం.
  • బలంగా దువ్వడం.
  • తల ఆరకముందే పడుకోవడం.
  • తడి జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో సులభంగా విరిగిపోతుంది.

వర్షంలో తడిస్తే ఏమి చేయాలి?

  • ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రమైన నీటితో జుట్టును కడగాలి.
  • అవసరమైతే సల్ఫేట్-రహిత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
  • మెత్తని టవల్‌తో మెల్లగా తుడిచి ఆరబెట్టాలి.
  • జుట్టును ఎక్కువసేపు తడిగా ఉంచకూడదు.
  • బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ ఉపయోగించడం మంచిది.
  • లీవ్-ఇన్ కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ ఉపయోగిస్తే కాలుష్యం నుంచి కొంత రక్షణ లభిస్తుంది.

వర్షపు నీరు ఒక్కటే జుట్టు రాలడానికి కారణం కాదు. కానీ వర్షంలో తడిచిన తర్వాత జుట్టును శుభ్రం చేయకుండా, ఎక్కువసేపు తడిగానే ఉంచితే చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తల చర్మ సమస్యలు పెరిగి జుట్టు రాలే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి వర్షాకాలంలో సరైన హెయిర్ కేర్ పాటించడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *