Headlines

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు


జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో రైతులు వర్షాభావ పరిస్థితులతో, కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌ నినో ప్రభావంతో పంటలకు నీరందక ఎండిపోతున్న తరుణంలో, బోర్ మోటార్ల దొంగతనాలు వారిని మరింత నష్టాల్లోకి నెట్టాయి. ఈ ప్రాంతంలో దాదాపు 150 బోర్ మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి, వాటిలోని రాగి వైర్లను అమ్ముకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, రైతులంతా కలిసి తమ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సిద్ధమయ్యారు. రాత్రంతా తమ పొలాల వద్ద కాపలా కాసి, దొంగలను పట్టుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా, ఒక అర్ధరాత్రి కొంకల గ్రామం సమీపంలో ఒక ఆటోలో వచ్చిన ఎనిమిది మంది దొంగలు బోరు మోటార్లను చోరీ చేస్తుండగా రైతులు చుట్టుముట్టారు. ఆరుగురు పారిపోగా, ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు. వారిని, చోరీ చేసిన వైర్లను, ఆటోను పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ఒకరు కర్నూలు ప్రాంతానికి చెందినవారు కాగా, మరొకరు స్థానికుడు అని తెలిసింది. భారత్ మాల రహదారికి సమీపంలో ఉండటం వల్లే చోరీలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. క్రాస్ చెక్ చేయాల్సిందే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *