Headlines

వయాగ్రా ఎక్కువగా వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. ఎవరికి ఎక్కువ ప్రమాదమో తెలుసా.?

వయాగ్రా ఎక్కువగా వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. ఎవరికి ఎక్కువ ప్రమాదమో తెలుసా.?


నేటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా చాలా మంది పురుషులు లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో తక్షణ పరిష్కారం కోసం లేదా కేవలం ఉత్సాహం కోసం ‘వయాగ్రా'(సిల్డెనాఫిల్) లాంటి మాత్రలను ఆశ్రయించడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే, వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మాత్రలు వాడటం ఎంత ప్రమాదకరమో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. సాధారణంగా వయాగ్రా వేసుకున్నప్పుడు అది శరీరంలోని రక్తనాళాలను నాశనం చేస్తుంది. దీని ప్రభావం శరీరం మొత్తం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల తెలియని, కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కళ్లు ఎర్రబడటం, కళ్లలో మంటలు, విపరీతమైన తలనొప్పి, చెవుల్లో హోరు రావడం, నడుము నొప్పి లాంటివి సర్వసాధారణంగా కనిపిస్తాయి. చాలా మంది ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియక కంగారు పడుతుంటారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

వైద్యుల పర్యవేక్షణ లేకుండా వయాగ్రా వాడటం అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా.. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు లేదా గుండె కోసం మందులు వాడేవారు వయాగ్రా వేసుకుంటే సడన్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా బీపీ, డయాబెటిస్ ఉన్నవారికి రక్తనాళాలు ఇప్పటికే బలహీనంగా ఉంటాయి. వీరు ఈ మాత్రలు వాడితే కిడ్నీలు దెబ్బతినే లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది. వయాగ్రా అనేది ప్రాణాపాయం లేని మందే కావచ్చు, కానీ అది మీరు తీసుకునే ‘డోస్’ మీద ఆధారపడి ఉంటుంది. మీ బరువు, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి డాక్టర్ ఎంత మోతాదులో వాడాలో నిర్ణయిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *