Headlines

రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు

రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు


పొలాల నుంచి ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ ట్రాక్‌ను కమ్మేయడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు సికింద్రాబాద్ నుండి భద్రాచలం వెళ్తున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు 30 నిమిషాల పాటు అక్కడే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైల్వే ట్రాక్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాక రైలును తిరిగి పంపించారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే ట్రాక్ పక్కన పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలు రైలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం :

సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్

మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్

షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?

ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *