చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలనే ఆశ ఇంకా సజీవంగా ఉందని, దురాశ కాదని, కేవలం ఒక డాన్స్ పాటలో అయినా ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవిని “డాన్స్ అంటే చిరు గారు” అని ఆమె అన్నారు. చిరంజీవి నుంచి తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడే విధానం అని ఇంద్రజ అన్నారు. అందరితో ఎలా మర్యాదగా మాట్లాడాలి, కోపం ఉన్నప్పటికీ మాటల్లో ఎప్పుడూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలి అనే విషయాలను చిరంజీవి నుంచి గమనించి, నేర్చుకున్నానని తెలిపారు.