Headlines

రెంటుకి గర్బా పార్ట్‌నర్.. ఇదేం కొత్త ట్రెండ్ బాబోయ్! Gen-Z క్రేజీ ఐడియా వైరల్


దసరా, నవరాత్రుల పండుగ సమయం వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా గర్బా, దాండియా వేడుకల కోలాహలం మొదలవుతుంది. రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో యువత రాత్రంతా డ్యాన్స్ చేస్తూ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి నవరాత్రులకు ముందు సోషల్ మీడియాలో Gen-Z ను ఆకట్టుకుంటున్న ఒక కొత్త పదం బాగా వైరల్ అవుతోంది. అదే రెంటల్ గర్బా పార్ట్‌నర్.

అసలేంటి ఈ రెంటల్ గర్బా పార్ట్‌నర్?

చాలామందికి గర్బా ఆడాలని ఆసక్తి ఉన్నప్పటికీ, వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయడానికి సరైన భాగస్వామి ఉండరు. ఈ సాధారణ సమస్యకు పరిష్కారంగా ఇన్స్టాగ్రామ్‌లో ఒక యూజర్ Rent a Garba Partner పేరుతో ఒక వినూత్న పోస్ట్ పెట్టారు. గర్బా నైట్స్‌కు తోడుగా రావడానికి, డ్యాన్స్ నేర్పడానికి, సోషల్ మీడియా రీల్స్, ఫోటోలకు భంగిమలు ఇవ్వడానికి అద్దె ప్రాతిపదికన పార్ట్‌నర్ అందుబాటులో ఉంటారనేది ఈ పోస్ట్ సారాంశం.

ఈ పోస్ట్‌లో గర్బా పార్ట్‌నర్ సేవలకు సంబంధించి మూడు రకాల ప్యాకేజీలను అందించడం విశేషం.

సిల్వర్ ప్యాకేజ్: రెండు గంటల పాటు గర్బా ఆడటంలో తోడుగా ఉండటం, బేసిక్ స్టెప్పులు నేర్పడం, ఫోటోలు దిగడం.

ఇవి కూడా చదవండి



గోల్డ్ ప్యాకేజ్: ఎక్కువ సమయం తోడుగా ఉంటూ, సోషల్ మీడియా కోసం రీల్స్ షూట్ చేయడం, సరదా కపుల్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం.

ప్లాటినమ్ ప్యాకేజ్: ఈవెంట్ ముగిసే వరకు తోడుగా ఉంటూ, డ్యాన్స్ సహాయంతో పాటు సురక్షితంగా డ్రాప్ చేయడం వంటి సేవలు.

పోలీసుల హెచ్చరిక, జాగ్రత్తలు:

ఈ ట్రెండ్ చూసి యువత సరదాగా నవ్వుకుంటున్నప్పటికీ, పోలీసు యంత్రాంగం, సైబర్ క్రైమ్ నిపుణులు దీనిపై హెచ్చరికలు జారీ చేశారు. రెంటల్ గర్బా పార్ట్‌నర్ పేరుతో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూసి ముందస్తుగా ఎలాంటి డిపాజిట్లు చేయకూడదు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోకూడదు. మొత్తానికి, పండుగ ఉత్సాహంలో Gen-Z తీసుకొచ్చిన ఈ రెంటల్ గర్బా పార్ట్‌నర్ కాన్సెప్ట్ ఒకవైపు డిజిటల్ ట్రెండ్‌గా మారుతుండగా, మరోవైపు భద్రత, అప్రమత్తతపై చర్చకు దారితీస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *