Headlines

రూ.928 ఇచ్చి.. రూ.8.23 లక్షలు కొట్టేశారు


అదనపు ఆదాయం కోసం చూస్తున్న వారి బలహీనతలను సైబర్ నేరగాళ్లు ఆయుధంగా మార్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ఒకరు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో జరిగిన భారీ మోసంలో రూ.8,23,751 కోల్పోయారు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 1న బాధితుడికి టెలిగ్రామ్ ద్వారా ఐశ్వర్య అనే మహిళ నుండి మెసేజ్ వచ్చింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డగ్లస్ ఎల్లిమాన్ పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. చిన్న చిన్న టాస్కులు పూర్తి చేస్తే రోజుకు రూ.500 నుండి రూ.1000 వరకు సంపాదించవచ్చని ఆశపెట్టింది. ఆ తర్వాత నీతు అనే మరో మహిళ రంగంలోకి దిగి, రోజుకు 25 గ్రాబింగ్ ఆర్డర్లు పూర్తి చేస్తే రూ.1000 నుండి రూ.3000 వరకు వస్తాయని, వారానికి రూ.15,000 జీతం ఉంటుందని నమ్మబలికింది. మొదట కొన్ని టాస్కులు పూర్తి చేసిన బాధితుడి ఖాతాలో రూ.928.92 జమ కావడంతో అతడికి నమ్మకం కలిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మొదటిసారి రూ.8,000 చెల్లిస్తే రూ.12,632 తిరిగి వచ్చాయి. ఇలా కొన్నిసార్లు లాభాలతో సహా తిరిగి చెల్లించడంతో బాధితుడు మరింత నమ్మి లక్షలు పెట్టుబడి పెట్టాడు. చివరకు ట్రెజర్ లాటరీ బాక్స్ పేరుతో భారీ నెగటివ్ బ్యాలెన్స్ చూపించి, మరింత డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడంతో మోసాన్ని గుర్తించాడు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి

ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ

40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ

బస్సు కోసం చూస్తుంటే.. లిఫ్ట్‌ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్‌ అమలు

పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె ఆగినంత పనైంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *