రూ.17 వేల లోపు మంచి ఫ్రీజ్‌ కోసం చూస్తున్నారా? అయితే ఈ మోడల్స్‌ బెస్ట్‌!

రూ.17 వేల లోపు మంచి ఫ్రీజ్‌ కోసం చూస్తున్నారా? అయితే ఈ మోడల్స్‌ బెస్ట్‌!


ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయడం ప్రతి ఇంటికీ సవాల్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిజ్ అనేది విలాస వస్తువు కాకుండా అవసరమైన గృహోపకరణంగా మారింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి కూలింగ్, విద్యుత్ ఆదా, సరైన నిల్వ సామర్థ్యం కలిగిన ఫ్రిజ్‌లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. రూ.17,000 లోపు లభించే సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్లు ఈ అవసరాలకు సరైన పరిష్కారంగా నిలుస్తున్నాయి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంపికలలో హైయర్ 190L 5 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. చిన్న, మధ్య తరహా కుటుంబాలకు సరిపోయే ఈ మోడల్ వేగంగా ఐస్ తయారు చేసే సామర్థ్యంతో పాటు పెద్ద వెజిటబుల్ బాక్స్‌ను అందిస్తుంది. విద్యుత్ ఆదా, పనితీరు పరంగా ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు. అలాగే శాంసంగ్ 183L 4 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో నిశ్శబ్దంగా పనిచేస్తూ తక్కువ విద్యుత్ వినియోగంతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. త్వరితగతిన డీఫ్రాస్ట్ ఫీచర్ దీని ప్రత్యేకత.

భారతీయ బ్రాండ్‌లలో గోద్రెజ్ 185L 5 స్టార్ రిఫ్రిజిరేటర్ దీర్ఘకాల వారంటీతో వినియోగదారులకు భరోసా ఇస్తోంది. మొత్తం ఫ్రిజ్‌పై 5 సంవత్సరాల వారంటీ ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. ఇంకా ఎక్కువ నిల్వ అవసరమున్న వారికి IFB 197L 5 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ మంచి ఎంపిక. హ్యుమిడిటీ కంట్రోలర్ వంటి ఫీచర్లు పండ్లు, కూరగాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. తక్కువ బడ్జెట్‌తో సరిపెట్టుకోవాలనుకునే వారికి వర్ల్‌పూల్ 184L 3 స్టార్ రిఫ్రిజిరేటర్ సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రాథమిక కూలింగ్ అవసరాలను తీర్చగలదు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *