RCB IPL 2026 : మా అసలు సిసలు బలం ఇదే.. గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది

RCB IPL 2026 : మా అసలు సిసలు బలం ఇదే.. గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది


RCB IPL 2026 : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన ఆర్సీబీ, గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మీడియా ముందుకు వచ్చి జట్టు సక్సెస్ సీక్రెట్‌ బయటపెట్టారు. గతంలో బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడే బెంగళూరు, ఈ సీజన్‌లో మాత్రం తన బౌలింగ్ వైవిధ్యంతో ప్రత్యర్థులను వణికిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుగా ఓడించిన తర్వాత ఉత్సాహంగా ఉన్న ఆర్సీబీ జట్టు, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పై కన్నేసింది. ఈ సందర్భంగా ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ.. జట్టులోని బౌలింగ్ వైవిధ్యం తమ అతిపెద్ద బలమని పేర్కొన్నారు. పవర్ ప్లే లోనే వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంలో తమ బౌలర్లు సఫలమవుతున్నారని ఆయన కొనియాడారు. పిచ్ ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా.. అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేయగల నైపుణ్యం తమ దగ్గర ఉందని ధీమా వ్యక్తం చేశారు.

జట్టులో భువనేశ్వర్ కుమార్ లాంటి స్వింగ్ మాస్టర్ ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. భువీ తన పాత రోజులను గుర్తుకు తెస్తూ బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. ఇక జోష్ హేజిల్‌వుడ్ టెస్ట్ మ్యాచ్ తరహా లైన్ అండ్ లెంగ్త్ తో బ్యాటర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి పవర్ ప్లే లోనే ప్రత్యర్థి జట్టు నడ్డి విరుస్తున్నారని కోచ్ ప్రశంసించారు. మధ్యలో క్రునాల్ పాండ్యా తన స్పిన్ మ్యాజిక్ తో పరుగుల నియంత్రణ చేయడమే కాకుండా వికెట్లు కూడా పడగొడుతుండటం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది.

కేవలం బౌలింగే కాదు, బ్యాటింగ్ లో కూడా ఆర్సీబీ చాలా లోతుగా ఉందని ఫ్లవర్ గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ, ఇతర అగ్రశ్రేణి బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం వల్ల ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించగలమనే నమ్మకం జట్టులో పెరిగిందని ఆయన అన్నారు. 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా, మరోవైపు గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో కింది స్థానాల్లో ఉంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఆర్సీబీ మరోసారి విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *