రక్షక భటుడే భక్షకుడైతే..? ఖాకీ ముసుగులో కామాంధుడు.. బాధితురాలిపై సీఐ అఘాయిత్యం!

రక్షక భటుడే భక్షకుడైతే..? ఖాకీ ముసుగులో కామాంధుడు.. బాధితురాలిపై సీఐ అఘాయిత్యం!


పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్ ఉన్నతాధికారిపై వచ్చిన అత్యాచార ఆరోపణలు స్థానికంగా పెను సంచలనం సృష్టించాయి. గతంలో వినుకొండలో సీఐగా పనిచేసి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్నమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ ఒక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని ఒక ఫామ్ హౌస్‌లో ఈ దారుణం జరిగింది. సదరు ఫామ్ హౌస్‌లో ఆమె పని మనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన సీఐ చిన్నమల్లయ్య, తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. రక్షించాల్సిన అధికారియే భక్షకుడిగా మారాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దారుణానికి ఒడిగట్టిన ఈ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన వినుకొండ టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం బాధితురాలిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫామ్ హౌస్ వద్ద ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ప్రస్తుతం నిందితుడు పోలీస్ శాఖలోనే ఉన్నత హోదాలో ఉండటంతో, తనకు న్యాయం జరుగుతుందో లేదో అన్న భయాందోళనలో బాధితురాలు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు బహిరంగ విన్నపం చేసుకుంది. “ఒక సాధారణ మహిళపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడి చేసిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు, నా కుటుంబానికి న్యాయం చేయాలి” అని ఆమె వేడుకుంటోంది.

పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు సీఐ కావడంతో ఈ కేసును పోలీసులు ఎంతవరకు నిష్పక్షపాతంగా విచారిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ వేగవంతం కానుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *