మ్యాచ్‌కు ముందు 3వేలు.. తర్వాత 3 లక్షలు.. గంటల వ్యవధిలోనే మారిన SRH ప్లేయర్ ఫేట్..!

మ్యాచ్‌కు ముందు 3వేలు.. తర్వాత 3 లక్షలు.. గంటల వ్యవధిలోనే మారిన SRH ప్లేయర్ ఫేట్..!


Praful Hinge: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన ప్రఫుల్ హింగే, తన బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించాడు. జట్టు ఎదుర్కొంటున్న బౌలింగ్ సమస్యలకు తనే సరైన పరిష్కారమని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో ముగ్గురు కీలక బ్యాటర్లను వెనక్కి పంపి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

ఒకే ఓవర్‌లో ముగ్గురు బ్యాటర్లు క్లీన్ స్వీప్..

ప్రఫుల్ హింగే వేసిన ఆ మాయాజాలపు ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రమాదకరమైన బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‌లను వరుస విరామాల్లో ఔట్ చేసి రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ ప్రదర్శనతో స్టేడియంలోని అభిమానులే కాకుండా, నెటిజన్లు కూడా ఇతని ప్రతిభకు ఫిదా అయిపోయారు.

సోషల్ మీడియాలో రికార్డు స్థాయి ఫాలోయింగ్..

మైదానంలో ప్రఫుల్ వికెట్లు తీస్తుంటే, ఇటు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పరుగులు తీసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రఫుల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కేవలం 3 వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉండేవారు. కానీ, అద్భుతమైన స్పెల్ ముగిసేసరికి ఆ సంఖ్య 3 లక్షలు దాటిపోవడం విశేషం. ప్రస్తుతం ఇతడిని 3.20 లక్షల మంది అనుసరిస్తున్నారు. సాధారణంగా వేలల్లో వచ్చే వీక్షణలు ఇప్పుడు మిలియన్లకు చేరుకున్నాయి.

తల్లిదండ్రుల భావోద్వేగ వీడియో వైరల్..

తను తొలి ఓవర్ వేస్తున్న సమయంలో తన తల్లిదండ్రులు టీవీ ముందు కూర్చుని చూస్తున్న దృశ్యాలను ప్రఫుల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 46 లక్షల మంది వీక్షించారు. ఒక సామాన్య క్రికెటర్ స్థాయి నుంచి ఒక్క మ్యాచ్‌తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రఫుల్ ప్రయాణం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *