తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల కాన్సెప్ట్ ఏదైనా, మైథలాజికల్ టచ్ ఇవ్వడం ప్రస్తుతం సాధారణంగా మారింది. కేవలం ఆధ్యాత్మిక చిత్రాలు లేదా పురాణ పురుషులకు సంబంధించిన కథలే కాకుండా, ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ పౌరాణిక అంశాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రముఖ హీరో పుట్టినరోజుకు విడుదలైన రాకా లుక్ ఈ కోవలోనిదేనని అభిమానులు చెబుతున్నారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమా మాత్రమే కాదని, అంతకు మించి పౌరాణిక స్పర్శ ఉంటుందని వార్తలు ఊపందుకున్నాయి.
మన దగ్గర నిర్మాణంలో ఉన్న పలు భారీ చిత్రాల్లో ఈ మైథలాజికల్ ఫాంటసీ టచ్ కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలోనూ పౌరాణిక ప్రభావం ఉంది. మహేష్ బాబు వారణాసి చిత్రంలో శ్రీరామచంద్రుడి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది.