పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరాయి. బెంగాల్లో మమతా బెనర్జీ విశ్వసనీయత ప్రమాదంలో పడగా, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం ఉదయం 9 గంటల వరకు ఉన్న ఓటింగ్ గణాంకాలను విడుదల చేసింది.
ఉదయం 9 గంటల సమయానికి బెంగాల్లో 18.76 శాతం ఓటింగ్ నమోదు కాగా, దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులో 17.69 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి 20.51 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
State Assembly Elections | Approximate voter turnout as of 9 am
Tamil Nadu – 17.69%West Bengal (phase 1) – 18.76% pic.twitter.com/U6QOmOxLSo
— ANI (@ANI) April 23, 2026
రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పోలింగ్ బూతుల్లో క్యూ కట్టి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌కు గానూ 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, పోలింగ్ ప్రారంభంలో పలుచోట్ల EVMల మొరాయింపు
మరోవైపు, ముర్షిదాబాద్‌లో పోలింగ్ సమయంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ నుండి ఫిరాయించిన హుమాయున్ కబీర్, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బందిపై కూడా దాడి జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..