తెలంగాణ వాసులకు భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటిందంటే చాలూ విశ్వరూపంతో జనాలపై విరుచుకుపడుతన్నాడు. దీంతో ఆఫీస్‌లకు వెళ్లే జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడి కారణంగా ఎక్కపోతతలో ఉక్కిరిబిక్కిరిక అవుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలో సుమారు 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదైనట్టు వాతావరణ వాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే?
గురువారం ఉదయం 9గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో పాలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట, గద్వాల్ , వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పస్టం చేసింది.
RED ALERT FOR NORTH TELANGANA ⚠️🟥
Dear people of Telangana, get ready for SEVERE HEATWAVE 2.0 from tomorrow with temperatures to touch 45°C in RED MARKED districts during April 24-29 ⚠️
Orange marked districts temperatures to cross 43-44°C during mentioned period
Hyderabad… pic.twitter.com/6AYdwOyKS7
— Telangana Weatherman (@balaji25_t) April 23, 2026
ఇక రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు చూసుకుంటే?
బుధవారం రాష్ట్రంలో గరిష్ఠంగా అదిలాబాద్ 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్ 41.8 డిగ్రీలు, రామగుండంలో 41.2 డిగ్రీలు మహబూబ్ నగర్ లో 40.6 డిగ్రీలు, మెదక్ లో 40.9 డిగ్రీలు, ఖమ్మంలో 40.8 డిగ్రీలు ,భద్రాచలంలో 40.6 డిగ్రీలు నల్గొండలో 40 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39.2 డిగ్రీలు, హకీంపేట్‌లో 39.3 డిగ్రీలు, హనుమకొండ జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది
బయటకు వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రాష్ట్రంలో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్న నేపథ్యంలో బయటకెళ్లేప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. అలాగే బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా కళ్లజోడు ధరించండి. తలకు నేరుగా ఎండ తగలకుండా స్కార్ఫ్ లేదా రుమాలు కట్టుకోండి. దాహం వేసినా, వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, రాగి అంబలి వంటివి తాగడం ఉత్తమం. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.