Headlines

‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్‌కు పెద్ద అడ్డంకి


నివిన్ పౌలీ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహం కుడుంబ యూనిట్. కేరళంలో ఓనమ్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తోంది. మరికొన్ని గంటల్లో ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈసినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం థియేట్రికల్ స్క్రీనింగ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు గట్టి షాక్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విండో (తక్కువ సమయంలోనే ఓటీటీలోకి రావడం) కారణాన్ని చూపుతూ ప్రముఖ మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌లు తమ స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి తిరస్కరించాయి. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చే సినిమాలకు మల్టీప్లెక్స్‌లు స్క్రీన్లు కేటాయించకూడదనే నిబంధనను ఈ చిత్రానికి వర్తింపజేశారు. దీనివల్ల ఈ తెలుగు వెర్షన్‌కు ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ల మద్దతు లభించలేదు. ఈ పరిణామాల కారణంగా ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ప్రదర్శించబడనుంది. కేరళం బయట ఫహద్, నివిన్ పౌలి వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఎంతో ఆసక్తితో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఏకైక ప్రాజెక్ట్ కావడంతో, మల్టీప్లెక్స్‌లు దూరం కావడం కొంత నిరాశపరిచే విషయమే. అయినప్పటికీ సింగిల్ స్క్రీన్స్ వేదికగా ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో వేచి చూడాలి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

వైకల్యాన్ని జయించి మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి..

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *