ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ధనుష్, మమితా బైజు మిడిల్ క్లాస్ జంటగా కనిపించబోతోన్నారనిపిస్తోంది. భార్యాభర్తలుగా వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కర’ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. విఘ్నేశ్ రాజా, ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్ సంయుక్తంగా ఈ కథను రచించారు. థేనీ ఈశ్వర్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా పని చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..
ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. త్వరలోనే ప్రమోషన్స్‌తో మేకర్స్ సందడి చేయనున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?