విజయనగరం జిల్లాలో ప్రయాణిస్తున్న బైక్ నుంచి మంటలు చెలరేగి భయాందోళనకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రాజాం మండలం కంచరాం గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కంచరాంకి చెందిన అల్లు రామారావు, సూర్యనారాయణలు కలిసి గ్రామ సమీపంలోని కల్లాలకు వెళ్లి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తున్నారు.