ప్రభుత్వం నుంచి ఆదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పింఛన్‌లు.. వారికే ఫస్ట్!

ప్రభుత్వం నుంచి ఆదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పింఛన్‌లు.. వారికే ఫస్ట్!


రాష్ట్రంలో కొత్త పింఛన్‌ల కోసం ఎదురుచూస్తు్న్న వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తల చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన వారిని పించన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది వితంతువులు కొత్త పింఛన్లకు అర్హులుగా ఉన్నట్లు అంచనా వేసింది. ముందుగా వీరందరికి అవకాశం కల్పించిన తర్వాద దివ్వాంగులకు పించన్లు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొత్త పించన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్తగా అర్హులుగా ఎంపిక చేసిన వారందరి నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్ అందింస్తే ప్రభుత్వంపై నెలకు సుమారు రూ. 61 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వం అంచనా వేసింది.

అయితే ఇప్పటికే లక్షకుపైగా దివ్యాంగులు కొత్త పించన్ల కోసం ధరఖాస్తు చేసుకోగా వితంతు పింఛన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న 6.50 లక్షల మందిలో సుమారు ఒక లక్ష మంది అనర్హులు ఉన్నట్లు కూబి ప్రభుత్వం గుర్తించింది. వారిని తొలగించి కేవలం అర్హులకే మాత్రమే పించన్లు అందేలా చూస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే కొత్త పించన్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 10 లక్షల మంది వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీరందరికీ పింఛన్లు అందిస్తే నెలకు రూ. 400 కోట్లు, ఏడాదికి సుమారు రూ. 4,800 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *