ప్రధాని మోదీ ఫేవరెట్ ఫుడ్ ఇదే..? దేశమంతా మెచ్చిన స్ట్రిట్ ఫుడ్ చరిత్ర తెలుసా

ప్రధాని మోదీ ఫేవరెట్ ఫుడ్ ఇదే..? దేశమంతా మెచ్చిన స్ట్రిట్ ఫుడ్ చరిత్ర తెలుసా


ప్రధాని మోదీ ఫేవరెట్ ఫుడ్ ఇదే..? దేశమంతా మెచ్చిన స్ట్రిట్ ఫుడ్ చరిత్ర తెలుసా

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనల్లో ఏదో ఒక ఆసక్తికర సంఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్‌గ్రామ్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ అకస్మాత్తుగా ఒక చిన్న దుకాణం ముందు ఆగింది. వాహనం దిగిన ప్రధాని, అక్కడి దుకాణదారుడిని పలకరించి, బెంగాల్ ప్రఖ్యాత చిరుతిండి ‘ఝాల్‌మురీ’ని రుచి చూశారు. “సోదరా! ఒక ఝాల్‌మురీ ఇవ్వు.. రుచికరంగా తయారు చెయ్” అని అడిగి మరీ తిన్నారు. ఆ తర్వాత డబ్బులు తీసుకోవడానికి నిరాకరించిన ఆ వ్యాపారి చేతిలో బలవంతంగా నగదు పెట్టారు.

ఒకే వంటకం.. ఎన్నో పేర్లు!

ఝాల్‌మురీ అనేది కేవలం బెంగాల్‌కే పరిమితం కాలేదు. భారతదేశమంతటా ఇది రకరకాల పేర్లతో ప్రాచుర్యం పొందింది. ముంబైలో దీనిని తీపి, కారం కలిపిన ‘భేల్‌పురి’ అని పిలిస్తే, బెంగళూరులో కొబ్బరి తురుము జోడించి ‘చురుమురి’ అంటారు. ఒడిశాలో ‘మసాలా మురి’గా ఇది ఫేమస్. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో దీనిని ముంత మసాలా, పిడతకింద పప్పు, ఉగ్గాణి అని పిలుస్తుంటారు.

  • ముంత మసాలా : అల్యూమినియం ముంతలో (గిన్నె) మరమరాలు, మసాలాలు, నిమ్మరసం కలిపి ఇస్తారు కాబట్టి దీనికా పేరు వచ్చింది.
  • పిడతకింద పప్పు : ఇందులో మిరపకాయ బజ్జీ ముక్కలు కూడా కలుపుతారు. మరమరాలు మెత్తబడకుండా మట్టి కుండలో నిప్పులు వేసి వేడి చేయడం దీని ప్రత్యేకత.
  • ఉగ్గాణి : మరమరాలను నీటిలో నానబెట్టి తాలింపు వేసి చేస్తారు. రాయలసీమలో ‘ఉగ్గాణి-బజ్జీ’ కాంబినేషన్ ఒక అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్.

రుచితో పాటు ఆరోగ్యం కూడా!

ఈ చిరుతిండి కేవలం నాలుకకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నూనె వాడకం చాలా తక్కువగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసే పని లేకపోవడం వల్ల ఇది ఒక ‘సలాడ్’ లాంటి ఆహారం. టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి పచ్చి కూరగాయలు వాడటం వల్ల పోషకాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన స్నాక్ ఐటెం. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. విదేశీయులు సైతం లొట్టలేసుకుంటూ తినే ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్, ప్రధాని మోదీ పర్యటనతో మరోసారి గ్లోబల్ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ప్రాంతం ఏదైనా, పేరు ఏదైనా ఈ మరమరాల రుచికి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *