Headlines

పేద పిల్లల కోసం అమెరికా కార్పొరేట్ దిగ్గజాల పెద్ద మనసు


అమెరికాలో పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కార్పొరేట్ దిగ్గజాలు, బిలియనీర్లు విశాల హృదయాన్ని చాటుకుంటున్నారు. తమ కంపెనీల షేర్లు, నిధులను అమెరికన్ చిన్నారుల కోసం కేటాయిస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అమెరికన్ పిల్లలకు ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. 18 ఏళ్లలోపు ప్రతి బిడ్డకు రెండు చొప్పున స్పేస్‌ఎక్స్ షేర్లను కేటాయిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ రెండు షేర్లలో ఒకటి స్పేస్‌ఎక్స్ కంపెనీ తరపున, మరొకటి మస్క్ వ్యక్తిగతంగా అందిస్తారు. దీని మొత్తం విలువ సుమారు $18 బిలియన్లు (దాదాపు ₹1.5 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 72 మిలియన్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ షేర్ల పంపిణీ రెండు దశల్లో జరుగుతుంది. స్పేస్‌ఎక్స్ వాటా బదిలీ డిసెంబర్ 2026లో ప్రారంభమైతే, మస్క్ వ్యక్తిగత వాటా జూన్ 2027లో అందజేయబడుతుంది. ప్రభుత్వ మద్దతుతో కూడిన ట్రంప్ అకౌంట్స్ ద్వారా ఈ షేర్లు అందజేయబడతాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ తమ 20 శాతం షేర్లను పిల్లల కోసం కేటాయించగా, ఎన్విడియా, అమెరికన్ ఎయిర్‌లైన్స్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ వంటి 50కి పైగా దిగ్గజ సంస్థలు సైతం ఈ అకౌంట్లకు నిధులను బదిలీ చేస్తూ అమెరికా చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో మరో వింత పార్టీ హల్‌చల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *